హైదరాబాద్: 28°C
వార్తలు

పాపికొండల బోట్లపై అధికారులు కీలక చర్యలు

Advertisement

TG: పాపికొండల బోట్లపై అధికారులు కీలక చర్యలు చేపట్టారు. ఇవాళ్టి నుంచి విహారయాత్రలకు బ్రేక్ వేస్తూ, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు బోట్లను నిలిపివేయాలని ఆర్డీవో ఆదేశించారు. గండిపోచమ్మ దగ్గర బోట్లను ఆపాలని సూచించారు. అన్ని బోట్లకు ఫిట్‌నెస్ తనిఖీలు తప్పనిసరి చేశారు. ఈ తనిఖీల నివేదికలు వచ్చిన తర్వాతే యాత్రల పునరుద్ధరణపై అధికారులు తుది నిర్ణయం తీసుకోనున్నారు.

Advertisement

Advertisement