అన్నమయ్య జిల్లా కలికిరి మండలం యల్లంపల్లి సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 గొర్రెలు మృతి చెందాయి. సోమల- కలకడ రహదారిపై రోడ్డు దాటుతున్న గొర్రెల మందను వేగంగా వచ్చిన బొలేరో వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో గొర్రెల కాపరికి తీవ్ర గాయాలు కాగా, స్థానికులు అతడిని కలికిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వార్తలు
కలికిరిలో బొలేరో బీభత్సం.. 10 గొర్రెల మృతి
Advertisement
Advertisement
Advertisement


