హైదరాబాద్: 28°C
వార్తలు

కన్యాకుమారి-కశ్మీర్‌కు.. ఐటీ ఉద్యోగి పాదయాత్ర

Advertisement

పర్యావరణం, ప్రకృతి వనరుల రక్షణే ధ్యేయంగా తమిళనాడుకు చెందిన ఐటీ ఉద్యోగి విక్రమాదిత్యన్‌ కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు ఒంటరిగా 6,500KM పాదయాత్ర చేపట్టారు. 56 రోజుల్లో 1300KM పూర్తి చేసుకుని ఈ యాత్ర కర్ణాటకకు చేరింది. పర్యావరణ క్షీణత, యుద్ధాల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పిస్తూ ఆయన ప్రజల నుంచి సంతకాలు సేకరిస్తున్నారు. యాత్ర అనంతరం ఈ సంతకాలను మోదీకి అందజేయనున్నారు.

Advertisement

Advertisement