హైదరాబాద్: 28°C
వార్తలు

'రాయలసీమ రైతుల కన్నీళ్ల మీద అమరావతి నిర్మాణం'

Advertisement

ATP: రాయలసీమ రైతుల కన్నీళ్ల మీద అమరావతిని నిర్మిస్తున్నారని మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ విమర్శించారు. సింగనమలలో నిర్వహించిన నిరసన ర్యాలీలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడంలో విఫలమైందని ధ్వజమెత్తారు. అర్హులైన వారికి పింఛన్లు అందడం లేదని, మహిళలు, నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపించారు.

Advertisement

Advertisement