ఢిల్లీలో మరో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. తుగ్లకాబాద్ నివాస భవనంలో తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. గ్రౌండ్ ఫ్లోర్‌లోని పార్కింగ్ ఏరియాలో మంటలు చెలరేగి వాహనాలకు అంటుకుని క్షణాల్లోనే భవనం అంతటా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 8 ఫైర్ ఇంజిన్లతో రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఐదుగురిని రక్షించినట్లు అధికారులు తెలిపారు.
వార్తలు
మరో అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి
Advertisement
Advertisement
Advertisement


