హైదరాబాద్: 28°C
వార్తలు

పాలిటెక్నిక్ కళాశాలపై ABVP డిమాండ్

Advertisement

NRPT: నారాయణపేటకు మంజూరైన అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలను తిరిగి జిల్లాకు తీసుకురావాలని ABVP నాయకులు నరేశ్, సతీశ్ డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ సీహెచ్ ప్రియాంకకు వినతిపత్రం అందించారు. 2022లో మంజూరైన కళాశాలను ప్రైవేట్ భవనంలో కొనసాగించి తరువాత నాగర్‌కర్నూల్ జిల్లా పాలెంకు తరలించారని ఆరోపించారు. దీని వలన జిల్లావాసులకు తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయన్నారు.

Advertisement

Advertisement