హైదరాబాద్: 28°C
వార్తలు

పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలి: కూనంనేని

TG: కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచడాన్ని నిరసిస్తూ CPI ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనలు జయప్రదమయ్యాయని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. ప్రధాని మోదీ ధనిక, కార్పొరేట్ వర్గాలను వదిలేసి, సామాన్యులపై భారం మోపుతున్నారని మండిపడ్డారు. రూపాయి విలువ క్షీణించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.