హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు ఈ ప్రాంతాల్లో విద్యుత్ నిలిపివేత

NZB: నగరంలో 33కేవీ ఇంటర్ లింకింగ్ పనుల దృష్ట్యా గురువారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్-1 ఏడీఈ ఆర్. చంద్రశేఖర్ తెలిపారు. 11కేవీ గోశాల, రైల్వే ఫీడర్ల పరిధిలోని కాంగ్రెస్ భవన్, కవితా కాంప్లెక్స్, గంజ్, రామ్ గోపాల్ స్ట్రీట్, దేవి రోడ్, మిర్చి కంపౌండ్ తదితర ప్రాంతాల ప్రజలు సహకరించాలని కోరారు.