హైదరాబాద్: 28°C
వార్తలు

మహిళలను కించపరిస్తే సహించేది లేదు: సీతక్క

TG: మహిళల ఎదుగుదలే సమాజ ప్రగతికి పునాది అని మంత్రి సీతక్క అన్నారు. భువనగిరిలో 3 వేల మంది మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ పూర్తికాగా, HYDలో వారికి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శిక్షణ పొందిన వారికి కుట్టు మిషన్లతో పాటు, సొంత వ్యాపారాల కోసం రూ.1 లక్ష నుండి రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు. మహిళలను కించపరిస్తే సహించేది లేదని హెచ్చరించారు.