ప్రకాశం: వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు సురక్షితమైన, పరిశుభ్రమైన విద్యా వాతావరణాన్ని కల్పించాలని ఎంఈవో-1 అబ్దుల్ సత్తార్ కోరారు. గిద్దలూరులో ఈ సూచనలు జారీ అయ్యాయి. పాఠశాల ఆవరణ, తరగతి గదులు, మరుగుదొడ్లు, వంటశాల, తాగునీటి ట్యాంకులు వంటి ప్రాంతాలను శుభ్రపరచాలని ఆయన పాఠశాలల సిబ్బందికి తెలిపారు.
వార్తలు
'పాఠశాలల్లో పరిశుధ్యం చేపట్టాలి'


