ASR: ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు, ఆర్టీసీ కాంప్లెక్స్‌లలో, బస్టాపులలో మౌళిక వసతులు కల్పించాలని కలెక్టర్ నిశాంతి ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్‌ను ఆకస్మికంగా సందర్శించారు. క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టారు. బస్సు స్టేషన్ నిర్వహణ, పరిశుభ్రతపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రయాణికులతో ఆమె నేరుగా మాట్లాడారు.
వార్తలు
'మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలి'


