హైదరాబాద్: 28°C
వార్తలు

హైవేపై పోలీసుల విస్తృత తనిఖీలు

SRP: మాదకద్రవ్యాల అక్రమ తరలింపు నివారణలో భాగంగా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు చివ్వెంల మండలం గుంపుల శివారు జాతీయ రహదారిపై పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. పోలీస్ జాగిలంతో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. డ్రగ్స్, నిషేధిత పదార్థాలు తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఎస్సై మహేశ్వర్ హెచ్చరించారు. తనిఖీల్లో డాగ్ స్క్వాడ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.