హైదరాబాద్: 28°C
వార్తలు

ఫిర్యాదులపై నిర్లక్ష్యం చేస్తే చర్యలే: ఎస్పీ

గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ కీలక ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే ప్రజలతో మర్యాదగా వ్యవహరించి, వారి ఫిర్యాదులను చట్ట ప్రకారం సత్వరమే పరిష్కరించాలని సూచించారు. ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యం వహించే అధికారులపై శాఖపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.