హైదరాబాద్: 28°C
వార్తలు

ఆన్‌లైన్ పెట్టుబడులతో జాగ్రత్త.. ఎస్పీ హెచ్చరిక.!

KRNL: ఆన్‌లైన్ పెట్టుబడుల పేరుతో జరుగుతున్న సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బుధవారం ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. తక్కువ సమయంలో భారీ లాభాలు వస్తాయని నమ్మించి సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్‌బుక్‌లలో నకిలీ పెట్టుబడి గ్రూపుల ద్వారా అమాయకులను వలలోకి దింపుతున్నారని ఎస్పీ హెచ్చరించారు.