హైదరాబాద్: 28°C
వార్తలు

పచ్చని మందస కోసం గో గ్రీన్ పిలుపు

SKLM: మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మందస వైద్యులు డాక్టర్ ప్రకాష్‌రావు పిలుపునిచ్చారు. గో గ్రీన్ సంస్థ ఆధ్వర్యంలో బుధవారం మందస గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. నాటిన మొక్కల సంరక్షణ కోసం ఐరన్ గార్డులు ఏర్పాటు చేశారు. పచ్చదనంతో మందసను తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ పర్యావరణ యజ్ఞంలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు.