GNTR: తెనాలి (మం) సంగంజాగర్లమూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ అమర్తలూరి శ్రావణ్ బాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, అందుబాటులో ఉన్న మందులు, నిర్వహిస్తున్న రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆసుపత్రి నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
వార్తలు
పీహెచ్‌సీని తనిఖీ చేసిన జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి


