హైదరాబాద్: 28°C
వార్తలు

GHMC, HRMLకు హైకోర్టు నోటీసులు

TG: మెట్రోస్టేషన్ల కింద పాదచారుల బాటను స్టాళ్లకు(షాపులకు) లీజుకు ఇవ్వడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఫుట్‌పాత్‌ను లీజుకు ఎలా ఇస్తారని ప్రశ్నించింది. దీనిపై నివేదిక ఇవ్వాలని GHMC, HRMLను ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 17కు వాయిదా వేస్తూ త్వరగా కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొంది.