హైదరాబాద్: 28°C
వార్తలు

పోగొట్టుకున్న ఫోన్‌ను అప్పగించిన ఎస్సై

BHPL: పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా గుర్తించి బుధవారం బాధితుడికి చిట్యాల ఎస్సై సతీష్ అందచేశారు. ఎస్సై కథనం ప్రకారం చిట్యాల మండలం రామచంద్రపురానికి చెందిన సురేందర్ అనే వ్యక్తి మొబైల్ ఫోన్‌ను పోగొట్టుకున్న స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసాడు. దీంతో ఎస్సై సాంకేతికతను ఉపయోగించి మొబైల్ ఫోన్ ఆచూకీ కనుగొని బాధితుడికి అందచేశారు.