హైదరాబాద్: 28°C
వార్తలు

'నూతన ఉపాధి హామీ నిబంధనలు రద్దు చేయాలి'

NLG: కేంద్రం ప్రవేశపెట్టిన నూతన ఉపాధి హామీ నిబంధనలను రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు దండంపల్లి సరోజ డిమాండ్ చేశారు. బుడమర్లపల్లిలో బుధవారం జరిగిన మండల మహాసభలో ఆమె మాట్లాడుతూ.. కొత్త నిబంధనలతో కూలీలకు పని, వేతనాలు అందడం లేదని ఆరోపించారు. జూన్ 12న తిప్పర్తిలో జరిగే జిల్లా మహాసభలో భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.