హైదరాబాద్: 28°C
వార్తలు

బీజేపీ చీఫ్ రాష్ట్ర పర్యటన ఖరారు

బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణ పర్యటనకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 17 నుంచి మూడు రోజుల పాటు ఆయన రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో రెండు రోజులు, వరంగల్‌లో ఒక రోజు పర్యటించి స్థానిక నాయకత్వంతో భేటీ అవుతారు. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.