హైదరాబాద్: 28°C
వార్తలు

'రసాయనాల వినియోగాన్ని తగ్గించాలి'

KMM: వైరా పట్టణంలో ఇవాళ ప్రకృతి వ్యవసాయం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా అశ్వారావుపేట అసెంబ్లీ బీజేపీ కన్వీనర్ గొట్టిపుల శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ.. రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబించడం ద్వారా సాగు ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు భూమి సారాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. రసాయనాల వినియోగాన్ని తగ్గించాలని సూచించారు.