హైదరాబాద్: 28°C
వార్తలు

ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి: ఎమ్మెల్యే

KDP: చెన్నూరులోని అరుంధతి నగర్ లో నిర్వహించిన 'స్వచ్ఛ పదం'లో ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్య రెడ్డి పాల్గొన్నారు. ఆయన డ్రైనేజీ కాలువలను పరిశీలించారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి ప్రజలతో మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని కోరారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని, వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.