ASR: చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో బుధవారం చింతపల్లి సంతలో ఖేత్ బచావో అభియాన్ నిర్వహించారు. సేంద్రియ వ్యవసాయం, ఆర్గానిక్ ఉత్పత్తులపై ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పించారు. రైతులు రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి, సేంద్రియ వ్యవసాయం చేయాలని ఏడీఆర్ డా.అప్పలస్వామి, ఏవో టీ.మధుసూధనరావు రైతులకు సూచించారు.
వార్తలు
ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమం


