హైదరాబాద్: 28°C
వార్తలు

పాతబస్తీ 3వ శానిటేషన్ డివిజన్‌‌లో కమిషనర్ పర్యటన

కర్నూలు నగరపాలక సంస్థ సేవలపై ప్రజలు సంతృప్తి చెందడమే ఉద్యోగుల పనితీరుకు నిజమైన కొలమానమని కమిషనర్ చల్లా ఓబులేసు అన్నారు. బుధవారం పాతబస్తీ 3వ శానిటేషన్ డివిజన్‌తో పాటు బొంగుల బజార్, గౌలిగేరి, మండిబజార్, ఖడక్‌పూర్ ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్య పనులు, తాగునీటి సరఫరాను పరిశీలించారు. ఇంటింటి చెత్త సేకరణ వంద శాతం జరగాలని ఆదేశించారు.