హైదరాబాద్: 28°C
వార్తలు

మోదీపై మలేషియా ప్రధాని ప్రశంసల జల్లు

Advertisement

అత్యధిక రోజులు పనిచేసిన ప్రధానిగా మోదీ చారిత్రక మైలురాయిని అధిగమించిన సందర్భంగా మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఆయనను అభినందించారు. భారత్‌ను ప్రపంచ వేదికపై శక్తివంతంగా నిలపడంలో మోదీ కృషి అనన్యమన్నారు. ఇరుదేశాల మధ్య ఉన్న సుదీర్ఘ స్నేహాన్ని తాము గౌరవిస్తామని, ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తామన్నారు. భారత ప్రజలు శాంతి, శ్రేయస్సుతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

Advertisement

Advertisement