SRPT: నడిగూడెం మండల కేంద్రంలోని చౌదరి చెరువులో ఉపాధి హామీ కూలీలతో చేపట్టిన పూడికతీత పనులను బుధవారం గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపాధి కూలీలందరూ పనులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కూలీలకు 100 రోజుల ఉపాధి కల్పించేలా పనులను గుర్తించాలని ఫీల్డ్ అసిస్టెంట్ పద్మకు ఆదేశించారు. మట్టి అవసరమైన రైతులు తమ పొలాలకు తరలించుకోవాలన్నారు.
వార్తలు
నడిగూడెంలో చెరువు పూడికతీత పనుల ప్రారంభం...


