హైదరాబాద్: 28°C
వార్తలు

మోదీ 12 ఏళ్ల మైలురాయిపై జైరాం రమేశ్ విమర్శలు

ప్రధానిగా మోదీ 12 ఏళ్ల పాలనను పూర్తి చేయడంపై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ విమర్శించారు. మోదీ స్వయం ప్రకటిత మైలురాయిని దాటారేమో కానీ, దేశానికి పెద్ద సమస్యగా మారారని మండిపడ్డారు. 1952, 1957, 1962 ఎన్నికల్లో నెహ్రూ భారీ మెజార్టీతో గెలిచారని.. కానీ 2024లో మోదీ తాయిలాలు ఇచ్చి పీఎం అయ్యారన్నారు. మోదీ పాలనలో పేపర్ లీక్‌లతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు.