హైదరాబాద్: 28°C
వార్తలు

టీఎంసీకి మరో ఎంపీ రాజీనామా

అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత టీఎంసీకి వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. తాజాగా మరో రాజ్యసభ ఎంపీ సుష్మితా దేవ్‌ రాజీనామా చేశారు. తన రాజ్యసభ సభ్యత్వంతో పాటు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. గత వారంలో రాజీనామా చేసిన రెండో ఎంపీ ఈమె కావడం గమనార్హం. ఇప్పటికే లోక్‌సభలో ఎన్డీయేకు మద్దతిస్తున్నట్లు టీఎంసీ రెబల్‌ ఎంపీలు ప్రకటించారు.