హైదరాబాద్: 28°C
వార్తలు

భారత్‌లో గూగుల్‌ క్లౌడ్‌ సేవలకు అంతరాయం

ఢిల్లీలోని గూగుల్‌కు చెందిన థర్డ్ పార్టీ డేటా సెంటర్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో నెట్‌వర్క్ పరికరాల విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఫలితంగా దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నైలో క్లౌడ్ సేవలకు అంతరాయం కలిగింది. పరిష్కార చర్యల్లో భాగంగా ఈ డేటా సెంటర్‌ నుంచి ట్రాఫిక్‌ను వేరే మార్గాలకు మళ్లించినట్లు గూగుల్ తెలిపింది.