హైదరాబాద్: 28°C
వార్తలు

మోదీ రికార్డ్‌.. రాష్ట్రపతి అభినందనలు

ప్రధానిగా 12 ఏళ్ల పాటు సుదీర్ఘంగా కొనసాగుతున్న నేతగా మోదీ సరికొత్త చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధానికి  రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. మోదీ నాయకత్వంపై దేశ ప్రజలకు ఉన్న అచంచలమైన నమ్మకమే ఈ మైలురాయికి నిదర్శనమని కొనియాడారు. అభివృద్ధి ఫలాలను చివరి గ్రామానికి కూడా అందించటమే ఈ విజయానికి ప్రతీక అని ప్రశంసించారు.