హైదరాబాద్: 28°C
వార్తలు

'కిసాన్ మేళాను విజయవంతం చేయాలి'

MLG: గోవిందరావుపేట (M) కేంద్రంలోని PSR గార్డెన్స్‌లో జూన్ 11న నిర్వహించనున్న కిసాన్ మేళాను విజయవంతం చేయాలని ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. సీతక్క హాజరుకానున్నారు.