హైదరాబాద్: 28°C
వార్తలు

దుగ్గిరాల గోపాలకృష్ణయ్యకు నివాళి

బాపట్ల తహసీల్దార్ కార్యాలయం వద్ద దుగ్గిరాల గోపాలకృష్ణయ్యకు బుధవారం నివాళులర్పించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఆర్డీవో హరికుమార్, తహసీల్దార్ షలీమా పాల్గొన్నారు. వారితో పాటు ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి పి.సి.సాయిబాబు కూడా ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా అధికారులు ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.