హైదరాబాద్: 28°C
వార్తలు

కెనడాలో భారత సంతతి పోలీసు హత్య!

కెనడాలో భారత సంతతి పోలీసు తరుణ్ బాలి హత్యకు గురయ్యారు. కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఆయనను.. 18 ఏళ్ల యువకుడు వాహనంతో ఢీకొట్టాడు. ఓ కేసులో నిందితుడిగా ఉన్న ఆ యువకుడు.. కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. దీంతో అతడిని పట్టుకునేందుకు తరుణ్, ఇతర పోలీసులు వెంబడించిన క్రమంలో బాలిని నిందితుడు వాహనంతో ఢీకొట్టాడు. తీవ్ర గాయాలతో ఆయను ఆసుపత్రికి తరలించగా అప్పడికే మరణించారు.