హైదరాబాద్: 28°C
వార్తలు

పారిజాతగిరిలో యోగాంధ్ర వేడుకలు

ELR: జంగారెడ్డిగూడెంలోని శ్రీ గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో బుధవారం యోగాంధ్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు భక్తులు, సిబ్బంది పాల్గొని యోగాసనాలు వేశారు. అలాగే ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శారీరక, మానసిక ఒత్తిడి నుంచి దూరం కావచ్చని అన్నారు.