హైదరాబాద్: 28°C
వార్తలు

నర్సుల ఆగ్రహం.. మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాజీనామా

హర్యానా మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రేణు భాటియాకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నర్సుల నిరసన సెగ తగిలింది. దీంతో ఆమె తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. కురుక్షేత్రలో విధులు నిర్వహిస్తున్న నర్సింగ్ సిబ్బందిపై ఆమె చేసిన వ్యాఖ్యలు నర్సులను ఆగ్రహానికి గురి చేశాయి. దీంతో ఆమె క్షమాపణలు చెప్పాలని నిరసన చేపట్టారు. ఈ సమయంలో తన రాజీనామా లేఖను సీఎం నయాబ్ సైనికి రేణు సమర్పించారు.