సత్యసాయి జిల్లా వ్యాప్తంగా బుధవారం ఉదయం వరకు పలు మండలాల్లో వర్షం కురిసింది. జిల్లాలోని 32 మండలాలకు గాను 13 మండలాల్లో వర్షపాతం నమోదైంది. అత్యధికంగా గోరంట్లలో 28.6 మిల్లీమీటర్లు, సోమందేపల్లిలో 21.4 మీ.మీ వర్షం పడింది. కొత్తచెరువులో 14.6, చెన్నేకొత్తపల్లిలో 14.4, బుక్కపట్నంలో 14 మీ.మీ చొప్పున వర్షం కురిసిందని అధికారులు తెలిపారు.
వార్తలు
గోరంట్లలో అత్యధిక వర్షపాతం నమోదు


