జమ్మూకశ్మీర్ బారాముల్లా జిల్లాలో దారుణం జరిగింది. ఉరి సెక్టార్‌లో అర్థరాత్రి ప్రమాదవశాత్తు హ్యాండ్ గ్రనేడ్ పేలి ఇద్దరు సైనికులు మృతి చెందారు. కమల్‌కోట్‌లో ఉన్న శిబిరంలో పరికరాలను అప్పగిస్తుండగా ఈ ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు. గాయపడిన ఇద్దరు జవాన్లను స్థానిక ఆర్మీ ఆసుపత్రికి తరలిస్తుండగా అప్పటికే వారు మరణించినట్లు తెలిపారు.
వార్తలు
హ్యాండ్ గ్రనేడ్ పేలి ఇద్దరు జవాన్లు మృతి


