హైదరాబాద్: 28°C
వార్తలు

2030కి 10 లక్షల మందికి ఏఐ శిక్షణ

దేశీయ ఏఐ రంగంలో 6 లక్షల ఉద్యోగాలకు గిరాకీ ఉంటే, 4.2 లక్షల మందే అందుబాటులో ఉన్నారని సేల్స్ ఫోర్స్ CEO అరుంధతీ భట్టాచార్య అన్నారు. 2027 నాటికి 12.5 లక్షల మంది నిపుణులు కావాలన్నారు. ఈ నైపుణ్యాల కొరతను తీర్చడానికి 2030 నాటికి 10 లక్షల మందికి ఉచిత ఏఐ శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ 'ఇండియా ఏఐ మిషన్', ఐటీ మంత్రిత్వ శాఖలతో కలిసి పనిచేస్తామని ఆమె వివరించారు.