హైదరాబాద్: 28°C
వార్తలు

ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని కాపాడిన ఎస్సై

కడప ప్రకాష్ నగర్‌కు చెందిన చికెన్ షాపు వ్యాపారి అప్పుల బాధతో మంగళవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు స్పందించిన కడప తాలూకా ఎస్సై మహమ్మద్ రఫీ, బ్లూ కోల్ట్స్ సిబ్బంది పుట్లంపల్లి ట్రాక్ వద్ద అతన్ని గుర్తించి, రైలు కింద పడకుండా ప్రాణాలు కాపాడారు. అనంతరం అతనికి కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.