హైదరాబాద్: 28°C
వార్తలు

పాఠశాలల్లో చివరి బెంచీకి స్వస్తి?

TG: బడిలో 'చివరి బెంచ్' లేకుండా కేరళ తరహాలో బెంచీలను యూ ఆకారం లేదా వృత్తాకారంలో ఏర్పాటు చేయాలని విద్యాశాఖ యోచిస్తోంది. సంప్రదాయ వరుసల విధానం వల్ల వెనుక బెంచ్ విద్యార్థులు నిర్లక్ష్యానికి గురవుతున్నారనే భావనతో ఈ మార్పు తెస్తున్నారు. ఈ కొత్త విధానం వల్ల టీచర్స్ ప్రతి ఒక్కరిపై దృష్టి పెట్టగలరని, బృంద చర్చలకు, విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.