TG: నీటిపారుదల శాఖ భూములు, జలాశయాలు, కాలువల్లో సౌర విద్యుత్ ఉత్పత్తికి కార్యాచరణ చేపట్టాలని మంత్రి ఉత్తమ్ అధికారులను ఆదేశించారు. జలసౌధలో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ప్రాజెక్టుల నిర్వహణకు భారీగా విద్యుత్ వ్యయం అవుతోందని, సొంత ఇంధన వనరుల సృష్టి ద్వారా ఈ ఖర్చును తగ్గించవచ్చన్నారు. ఇందుకోసం సౌర విద్యుత్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల అవకాశాలను పరిశీలించాలని సూచించారు.
వార్తలు
'నీటిపారుదల భూముల్లో సౌర విద్యుత్ ఉత్పత్తి'


