హైదరాబాద్: 28°C
వార్తలు

అడుగంటుతున్న ప్రాజెక్టులు.. ఆందోళనలో రైతులు

ఖరీఫ్ సీజన్‌కు అన్నదాతలు సన్నద్ధమవుతున్నారు. అయితే, తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు మాత్రం ఆందోళనకు గురిచేస్తున్నాయి. సాధారణంగా జూన్ మొదటి వారంలోనే వర్షాలు కురవడంతో ప్రాజెక్టుల్లోకి నీటి ప్రవాహాలు మొదలవుతుంటాయి. కానీ, ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. ఇంకా వర్షాలు ప్రారంభం కాలేదు. కృష్ణా, గోదావరి బేసిన్లలోని ప్రధాన ప్రాజెక్టులు డెడ్ స్టోరేజీ నిల్వలతో కొనసాగుతున్నాయి.