కోనసీమ: రావులపాలెం మండలం ఈతకోట టోల్ ప్లాజా వద్ద రవాణాశాఖ అధికారులు సోమవారం 28 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన 8 బస్సులపై కేసులు నమోదు చేసి, రూ.10,200 అపరాధ రుసుము విధించినట్లు DTO శ్రీనివాసరావు తెలిపారు. అతివేగం, సెల్ ఫోన్ డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవ్ వంటి ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు.
వార్తలు
రావులపాలెంలో ట్రావెల్స్ బస్సులపై తనిఖీలు


