AP: వర్షాకాలంలో పశువులకు సోకే వ్యాధుల నివారణకు ఉచిత టీకాలు వేయనున్నట్లు అధికారులు తెలిపారు. రేపటి నుంచి ఈనెల 30 వరకు జబ్బవాపు వ్యాధికి వ్యాక్సిన్లు వేస్తామన్నారు. ఈనెల 15 నుంచి జులై 15 వరకు చిటుక వ్యాధికి, ఈనెల 25 నుంచి జులై 25 వరకు గొంతు వాపునకు, జులై 1 నుంచి 30 వరకు నీలి నాలుక వ్యాధి నివారణకు టీకాలు అందిస్తామని చెప్పారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
వార్తలు
రేపటి నుంచి పశువులకు ఉచిత టీకాలు


