హైదరాబాద్: 28°C
వార్తలు

ఉజ్వల లబ్ధిదారులకు రాయితీ సిలిండర్లలో కోత

ఉజ్వల పథకం కింద ఇస్తున్న సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల సంఖ్యను కేంద్రం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఇకపై ఏడాదికి నాలుగు సిలిండర్లు మాత్రమే లబ్ధిదారులకు అందనున్నాయి. ఈ పథకంలో భాగంగా తొలుత ఏడాదికి 12 గ్యాస్ సిలిండర్లను సబ్సిడీపై అందించేవారు. గతేడాది ఈ సంఖ్యను 9కి తగ్గించి.. తాజాగా కేంద్రం మరింత కుదించింది.