హైదరాబాద్: 28°C
వార్తలు

స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. మోదీ దిగ్భ్రాంతి

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన సంతాపాన్ని తెలిపారు. అలాగే క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున సాయం ప్రకటించారు. అలాగే క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు చెప్పారు.