హైదరాబాద్: 28°C
వార్తలు

జూలైలో భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందం: కేంద్రమంత్రి

వచ్చే నెలలో భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన మొదటి విడత ప్రక్రియ పూర్తి అవుతుందని కేంద్రమంత్రి పియూష్ గోయల్ వెల్లడించారు. ఇటీవల కాలంలో తలెత్తిన పన్నులపై సుదీర్ఘ చర్చ జరుగుతుందని చెప్పారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించుకుంటూ పరస్పర మార్కెట్ భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడమే ఈ డీల్ ఉద్దేశమని తెలిపారు.