హైదరాబాద్: 28°C
వార్తలు

అలా చేస్తే బీజేపీ గెలవదు: తేజస్వి

బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహిస్తే బీజేపీ గెలవదని ఆర్జేడీ అధినేత తేజస్వీ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బ్యాలెట్ విధానంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ గెలిచే అవకాశమే లేదన్నారు. ఇండియా కూటమి సమావేశంలో అన్ని పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిపారు. దేశంలోని సమస్యలపై తామంతా కలిసి బలంగా పోరాడుతామని వెల్లడించారు. ఈ విషయంలో కూటమి పూర్తిగా ఐక్యంగా ఉందని పేర్కొన్నారు.