హైదరాబాద్: 28°C
వార్తలు

'ప్రజల్లో అవగాహన పెంచాలి'

VSP: ఆహార పదార్థాల నాణ్యత, భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం వుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజా అన్నారు. జిల్లా కోర్టు న్యాయ ప్రాధికార సంస్థలో సోమవారం ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ సురక్షితమైన, పౌష్టికాహారాన్ని పొందడం ప్రాథమిక హక్కు అని, కల్తీ ఆహార పదార్థాల వల్ల ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని అన్నారు.