హైదరాబాద్: 28°C
వార్తలు

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

SKLM: ఇచ్చాపురం మున్సిపాలిటీలో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బి. అశోక బాబు పలు అభివృద్ధి పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీ అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని తెలిపారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు మెరుగు పరచడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు ఉన్నారు.